Navapanchama Rajayoga Effect 2026: కుంభరాశిలో శుక్రుడి సంచారం: ఫిబ్రవరి 6 నుంచి 'నవపంచమ రాజయోగం'.. ఈ 5 రాశుల వారికి తిరుగులేని అదృష్టం!
Navapanchama Rajayoga Effect 2026: నవగ్రహాల్లో అత్యంత శుభ గ్రహాలుగా పరిగణించబడే శుక్రుడు, బృహస్పతి కలయికతో ఫిబ్రవరి నెలలో ఒక అద్భుతమైన యోగం ఏర్పడబోతుంది.
Navapanchama Rajayoga Effect 2026: నవగ్రహాల్లో అత్యంత శుభ గ్రహాలుగా పరిగణించబడే శుక్రుడు, బృహస్పతి కలయికతో ఫిబ్రవరి నెలలో ఒక అద్భుతమైన యోగం ఏర్పడబోతుంది. ఫిబ్రవరి 6న రాక్షస గురువు శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నారు. అదే సమయంలో మిథున రాశిలో ఉన్న దేవ గురువు బృహస్పతితో కలిసి శుక్రుడు 'నవపంచమ యోగాన్ని' సృష్టించబోతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాజయోగం కొన్ని రాశుల వారి జాతకాలను పూర్తిగా మార్చేయబోతోంది.
నవపంచమ యోగం అంటే ఏమిటి? జాతక చక్రంలో 5వ ఇల్లు జ్ఞానం, ప్రేమను సూచిస్తే.. 9వ ఇల్లు అదృష్టం, ఆధ్యాత్మికతను సూచిస్తుంది. ఈ రెండు గ్రహాల శుభ దృష్టి వల్ల సమాజంలో గౌరవం, ఆర్థిక పురోగతి లభిస్తాయి.
ఈ రాజయోగం వల్ల లబ్ధి పొందే అదృష్ట రాశులు ఇవే:
సింహ రాశి: మీకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిలిచిపోయిన ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి. వ్యాపారవేత్తలు భారీ ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన స్థితికి చేరుకుంటారు.
మిథున రాశి: మీ తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. పాత బాకీలు లేదా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి మీ చేతికి అందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది.
కుంభ రాశి: శుక్రుడు మీ రాశిలోనే సంచరిస్తుండటం వల్ల ప్రతి పనిలో విజయం లభిస్తుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది గోల్డెన్ టైమ్. విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రయాణాలు ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి.
మేష రాశి: నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. గతంలో మీరు చేసిన కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలం దక్కుతుంది. పెట్టుబడుల ద్వారా భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది.
తుల రాశి: మీరు మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు. సానుకూల శక్తి పెరుగుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పట్టిందల్లా బంగారం అన్నట్లుగా మీ పనులు సాగిపోతాయి.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్కులు, పంచాంగాలు, నమ్మకాలు లేదా మత గ్రంథాలు వంటి వివిధ మాధ్యమాల నుండి సేకరించి ఇవ్వబడింది. hmtv న్యూస్ దీనిని ధృవీకరించడం లేదు.