Venus Rising 2026: ఫిబ్రవరి 1 నుంచి ఈ రాశుల వారికి రాజయోగం.. శుక్రుడి ఉదయంతో కనకవర్షం!
ఫిబ్రవరి 1 నుంచి శుక్రుడి ఉదయం: మకర రాశిలో శుక్రుడి సంచారం కారణంగా ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది. సంపద, ఐశ్వర్యం పొందే ఆ రాశుల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Venus Rising 2026: జ్యోతిష్య శాస్త్రంలో సంపద, విలాసం, ప్రేమ మరియు శ్రేయస్సుకు కారకుడైన శుక్ర గ్రహం తన స్థితిని మార్చుకోబోతోంది. డిసెంబర్ 31న అస్తమించిన శుక్రుడు, ఫిబ్రవరి 1వ తేదీన మకర రాశిలో ఉదయించబోతున్నాడు (Venus Rise in Capricorn). శుభ గ్రహంగా భావించే శుక్రుడి ఈ మార్పు వల్ల నిలిచిపోయిన శుభ కార్యాలు ప్రారంభం కావడమే కాకుండా, ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఆర్థికంగా అద్భుతమైన యోగం పట్టబోతోందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ఆ అదృష్ట రాశులు ఇవే:
1. మకర రాశి (Capricorn): శుక్రుడు ఈ రాశిలోనే ఉదయించబోతుండటంతో వీరికి గోల్డెన్ పీరియడ్ ప్రారంభం కానుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి భారీ లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు రావడమే కాకుండా, ఇంట్లో నెలకొన్న పాత సమస్యలు పరిష్కారమవుతాయి.
2. వృషభ రాశి (Taurus): వృషభ రాశికి శుక్రుడే అధిపతి. కాబట్టి ఈ మార్పు వీరికి అత్యంత శుభప్రదం. ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. సమాజంలో ఆకర్షణ, గౌరవం పెరుగుతాయి. వివాహం కోసం వేచి చూస్తున్న అవివాహితులకు ఈ సమయంలో సంబంధం కుదిరే అవకాశం ఉంది.
3. మిథున రాశి (Gemini): మిథున రాశి వారికి శుక్రుడి కదలికల వల్ల అద్భుతమైన ఆర్థిక లాభాలు చేకూరుతాయి. సొంత ఇల్లు లేదా భూమి కొనాలనే కల నెరవేరుతుంది. గతంతో పోలిస్తే ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
4. తులా రాశి (Libra): తుల రాశి వారికి విలాసవంతమైన జీవితం లభిస్తుంది. సంపద పెరగడంతో పాటు సౌకర్యాల కోసం ఖర్చు చేస్తారు. కొత్త వ్యాపారాలు లేదా పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. ప్రతి పనిలోనూ లాభం చేకూరి మనశ్శాంతి లభిస్తుంది.
మొత్తానికి ఫిబ్రవరి 1 నుంచి ఈ నాలుగు రాశుల వారికి శుక్రుడి అనుగ్రహంతో ఐశ్వర్య యోగం పట్టబోతోంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్య శాస్త్ర నిపుణుల నుంచి సేకరించి రాసింది మాత్రమే. దీనిని hmtv న్యూస్ ధృవీకరించదు. అలాగే ఈ సమాచారం కేవలం మీ నమ్మకాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.