Valentine Week Horoscope 2026: ప్రేమ పక్షులకు పండగే.. ఈ వారం ఆ 5 రాశుల జాతకంలో 'ప్రేమ యోగం'.. మీ పార్ట్‌నర్‌ను కలిసే ఛాన్స్!

Valentine Week Horoscope 2026: వాలెంటైన్ వీక్ మొదలైంది! మేషం నుండి ధనుస్సు వరకు ఈ 5 రాశుల వారికి ఈ వారం ప్రేమ పరంగా అద్భుతంగా ఉండబోతోంది. మీ రాశి ఇందులో ఉందో లేదో జ్యోతిష్య నిపుణుల విశ్లేషణలో చూడండి.

Update: 2026-02-08 01:30 GMT

Valentine's Week 2026 Astrology: ప్రేమ పక్షులకు పండగే.. ఈ వారం ఆ 5 రాశుల జాతకంలో 'ప్రేమ యోగం'.. మీ పార్ట్‌నర్‌ను కలిసే ఛాన్స్!

Valentine Week Horoscope 2026: వాలెంటైన్ డేకి కౌంట్‌డౌన్ మొదలైంది. శనివారం నుండే ప్రేమికుల వారం ప్రారంభం కావడంతో యువతలో సందడి నెలకొంది. అయితే, ఈ సమయంలో గ్రహాల గమనం మరియు నక్షత్రాల స్థితిగతులు కొన్ని రాశుల వారికి కొత్త ప్రేమను తెచ్చిపెట్టనున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్కుడు సుదీప్ శాస్త్రి విశ్లేషణ ప్రకారం.. మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు రాశుల్లో జన్మించిన వారు ఈ వారం అత్యంత అదృష్టవంతులు.

ఆ 5 రాశుల ప్రేమ జాతకం ఇలా ఉంది:

1. మేష రాశి (Aries): ఈ రాశి వారికి ఇది భావోద్వేగపూరితమైన సమయం. కుజుడు మరియు శుక్రుడి అనుకూలత వల్ల మీరు చాలా కాలంగా మనసులో దాచుకున్న ప్రేమని బయటపెట్టడానికి ఇదే సరైన సమయం. మీ మనసుకి నచ్చిన వ్యక్తి ఈ వారంలో మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది.

2. మిథున రాశి (Gemini): బుధ గ్రహం అనుకూల స్థితిలో ఉండటం వల్ల మీ మాటతీరుతో ఎదుటివారిని సులభంగా ఆకర్షిస్తారు. సోషల్ మీడియా ద్వారా లేదా మిత్రుల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడి, అవి ప్రేమగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

3. సింహ రాశి (Leo): సింహ రాశి వారి సృజనాత్మకత ఈ వారం వారి పార్ట్‌నర్‌ను మంత్రముగ్ధులను చేస్తుంది. మీ మనసులోని భావాలను ఊహించని రీతిలో వ్యక్తం చేస్తారు. మీ నిజాయితీ మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

4. తుల రాశి (Libra): ప్రకృతి సిద్ధంగానే ప్రేమికులైన తుల రాశి వారు, ఈ వారంలో తమకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిని కనుగొంటారు. వివాహితులకు తమ భాగస్వామి నుండి అపారమైన ప్రేమ లభిస్తుంది. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు తమ బంధాన్ని తర్వాతి మెట్టుకు తీసుకెళ్లవచ్చు.

5. ధనుస్సు రాశి (Sagittarius): గురు గ్రహం (బృహస్పతి) ప్రభావంతో మీ ప్రేమ జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి. మీ ప్రియమైన వ్యక్తితో కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రపోజ్ చేయడానికి ఇది బెస్ట్ టైమ్.

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణుల అభిప్రాయాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని కేవలం మీ అవగాహన కోసం మాత్రమే చదవగలరు.

Tags:    

Similar News