Lunar Eclipse 2025: సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఈ రాశుల వారు ధనవంతులు కాబోతున్నారు..

Lunar Eclipse 2025: తెలుగు పంచాంగం ప్రకారం భాద్రపద మాసం ఆరో నెల. ఈ మాసంలో పౌర్ణమి రోజున రాహు గ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవించబోతోంది.

Update: 2025-08-25 05:57 GMT

Lunar Eclipse 2025: తెలుగు పంచాంగం ప్రకారం భాద్రపద మాసం ఆరో నెల. ఈ మాసంలో పౌర్ణమి రోజున రాహు గ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవించబోతోంది. ఇది శ్రీవిశ్వవసు నామ సంవత్సరంలో తొలి చంద్ర గ్రహణం కావడంతో విశేషంగా భావిస్తున్నారు.

చంద్ర గ్రహణం వివరాలు

తేదీ: సెప్టెంబర్ 7 (ఆదివారం)

ప్రారంభం (స్పర్శ కాలం): రాత్రి 9.56 (విజయవాడ సమయం), హైదరాబాద్‌లో 13 నిమిషాల తర్వాత

నిమీలన కాలం: రాత్రి 10.59

మధ్య కాలం: రాత్రి 11.41

ఉన్మీలన కాలం: అర్ధరాత్రి 12.22

మోక్ష కాలం: రాత్రి 1.26

పుణ్యకాలం ముగింపు: రాత్రి 3.30

మొత్తం మీద ఈ చంద్ర గ్రహణం రాత్రి 9.56 నుంచి ఉదయం 3.30 వరకు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఇది కనిపిస్తుంది.

ఆధ్యాత్మిక విశేషాలు

ఇది ఉత్తరాగోళం, అపసవ్య గ్రహణం, రాహుగ్రస్తం, పింగళ వర్ణం అని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఆలయాలు మూసివేయాలని శాస్త్రంలో ఎక్కడా లేవు కానీ సంప్రదాయం ప్రకారం మూస్తారు. మరుసటి రోజు ఆలయాల్లో సంప్రోక్షణ, ఇంట్లో దేవాలయ శుద్ధి చేసి పూజలు చేయాలి.

గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో పనులు చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి.

గ్రహణ దినంలో రాత్రి భోజనం చేయరాదు. ఆబ్దికం లేదా మాసికం వంటివి చేసే వారు రాత్రి 1.30లోపు పూర్తి చేసుకోవాలి.

రాశి ఫలితాలు

మేషం – ధన లాభం

వృషభం – కష్టాలు, ఇబ్బందులు

మిథునం – ఆందోళన, మానసిక ఒత్తిడి

కర్కాటకం – సౌఖ్యం, శాంతి

సింహం – స్త్రీ వలన కష్టాలు

కన్యా – అధిక కష్టాలు

తుల – మాన నష్టం

వృశ్చికం – సుఖం

ధనుస్సు – ధన, యశ లాభం

మకరం – ధన వ్యయం

కుంభం – ప్రమాదం, కష్టాలు

మీనం – హాని

ఎక్కువ జాగ్రత్త అవసరమయ్యే రాశులు

కుంభం, మీనం, తుల, మేషం, వృషభం, మిథునం, సింహం, కన్యా, మకరం రాశివారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

వాగ్వాదాలు, కొత్త పెట్టుబడులు నివారించాలి.

శివ నామస్మరణ, నవగ్రహ స్తోత్రాలు, మహా మృత్యుంజయ మంత్రం జపించడం వలన ఉపశమనం లభిస్తుంది.

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్కులు, పంచాంగాలు, నమ్మకాలు లేదా మత గ్రంథాలు వంటి వివిధ మాధ్యమాల నుండి సేకరించి ఇవ్వబడిన విషయాన్ని మేము ఇక్కడ ప్రస్తావించాము. ఇది హిందూ పంచాంగాల ప్రకారం కరెక్ట్ అయిన.. hmtv మాత్రం ధృవీకరించడం లేదు.

Tags:    

Similar News