Powerful Rajayoga 2026: పవర్‌ఫుల్ రాజయోగం 2026.. 4 గ్రహాల కలయికతో ఈ రాశులకు డబుల్ జాక్‌పాట్

Powerful Rajayoga 2026: ఫిబ్రవరి 2026లో నాలుగు గ్రహాల అరుదైన కలయికతో పవర్‌ఫుల్ రాజయోగం ఏర్పడుతోంది. మిథున, కుంభ, మేష, కన్య రాశులకు ఆర్థిక లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి.

Update: 2026-02-01 10:29 GMT

Powerful Rajayoga 2026: పవర్‌ఫుల్ రాజయోగం 2026.. 4 గ్రహాల కలయికతో ఈ రాశులకు డబుల్ జాక్‌పాట్

Powerful Rajayoga 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2026 ఫిబ్రవరి నెలలో అరుదైన చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతోంది. గ్రహ మండలంలో జరిగే ఈ కీలక సంచారాల కారణంగా కొన్ని రాశుల వారికి రాజయోగాలు ఏర్పడి ఆర్థికంగా విశేష లాభాలు చేకూరనున్నాయని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఫిబ్రవరి 3 నుంచి గ్రహ సంచారాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో బుధుడు కుంభ రాశిలోకి ప్రవేశించగా, ఫిబ్రవరి 6న శుక్రుడు, 13న సూర్యుడు, 23న కుజుడు అదే రాశిలోకి ప్రవేశించనున్నారు. దీంతో కుంభ రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు కలయికతో చతుర్గ్రాహి యోగం ఏర్పడనుంది.

ఈ సమయంలో లక్ష్మీ నారాయణ యోగం, శుక్రాదిత్య యోగం, ఆదిత్య మంగళ యోగం, బుధాదిత్య రాజయోగం వంటి అనేక శుభయోగాలు ఒకేసారి ఏర్పడుతున్నాయి. ఈ గ్రహయోగాల ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆదాయం పెరగడం, ఉద్యోగాల్లో పురోగతి, వ్యాపార లాభాలు వంటి శుభ ఫలితాలు లభించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

ప్రత్యేకంగా మిథున, కుంభ, మేష, కన్య రాశుల వారికి ఈ కాలం డబుల్ జాక్‌పాట్‌లా మారనుందని జ్యోతిష్య వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి బలోపేతం కావడం, కొత్త అవకాశాలు రావడం, జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు.

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నమ్మకాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ధృవీకరణ లేదని గమనించాలి.

Tags:    

Similar News