Malavya Rajayogam 2026: మాలవ్య మహాపురుష రాజయోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు.. డబ్బే డబ్బు..!
Malavya Rajyog 2026 Benefits On Zodiac: గ్రహాల గమనం వ్యక్తిగత జీవితంపైనే కాకుండా ప్రపంచంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
Malavya Rajyog 2026 Benefits On Zodiac: గ్రహాల గమనం వ్యక్తిగత జీవితంపైనే కాకుండా ప్రపంచంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలన్నింటిలో 'శుక్రుడి' సంచారానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఐశ్వర్యం, ప్రేమ, విలాసాలకు కారకుడైన శుక్రుడు ప్రతి నెలా రాశి మారుతుంటాడు. అయితే, ఈ ఏడాది మార్చి నెలలో శుక్రుడి సంచారం వల్ల అత్యంత శక్తివంతమైన ‘మాలవ్య మహాపురుష రాజయోగం’ ఏర్పడబోతోంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధనలాభంతో పాటు దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభించనుంది.
యోగ ప్రభావం చూపే ప్రధాన రాశులు ఇవే:
1. మిథున రాశి (Gemini): మిథున రాశి వారికి ఈ రాజయోగం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. వృత్తిపరంగా ఎదుర్కొంటున్న ఆటంకాలు తొలగిపోతాయి. కార్యాలయాల్లో మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు (Promotions) లభించే అవకాశం ఉంది. కొత్త ఆదాయ వనరులు పెరగడమే కాకుండా, వ్యాపారస్తులు లాభదాయకమైన కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.
2. కర్కాటక రాశి (Cancer): కర్కాటక రాశి వారికి మార్చి నెల నుంచి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఊహించని రీతిలో లాభాలు వస్తాయి. మానసిక ప్రశాంతత కోసం చేసే ప్రయాణాలు ఫలిస్తాయి. జీవితంలో సౌకర్యాలు పెరుగుతాయి. మొండి బాకీలు వసూలు కావడంతో ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి.
3. మీన రాశి (Pisces): మాలవ్య రాజయోగం వల్ల అత్యధికంగా లబ్ధి పొందేది మీన రాశి వారే. శుక్రుడి అనుగ్రహంతో మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది. ముఖ్యంగా వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయంలో సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో భారీ లాభాలు గడిస్తారు. మాట తీరుతో సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్య శాస్త్ర నిపుణుల నుంచి సేకరించి రాసింది మాత్రమే. దీనిని hmtv న్యూస్ ధృవీకరించదు. అలాగే ఈ సమాచారం కేవలం మీ నమ్మకాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.