Zoo park: జనం రాకపోవడంతో బెంగపెట్టుకుంటున్న జంతువులు.. వినూత్న ఆలోచన..
Zoo park: కరోనా మహమ్మారి వదిలిపోతే ఎంత బాగుంటుంది..? స్వేచ్ఛగా గాలి పీల్చుకోలేని పరిస్థితి ఒకవైపు కరోనా వస్తే ఆక్సిజన్ పైనే ఆధారపడాల్సిన పరిస్థితి మరోవైపు.
Zoo park: జనం రాకపోవడంతో బెంగపెట్టుకుంటున్న జంతువులు.. వినూత్న ఆలోచన..
Zoo park: కరోనా మహమ్మారి వదిలిపోతే ఎంత బాగుంటుంది..? స్వేచ్ఛగా గాలి పీల్చుకోలేని పరిస్థితి ఒకవైపు కరోనా వస్తే ఆక్సిజన్ పైనే ఆధారపడాల్సిన పరిస్థితి మరోవైపు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ అడవులకో వెళ్లి ఆంక్షలు లేకుండా హాయిగా బతుకుదామని చాలామందికి అనిపిస్తుంది. జంతువుల పని చాలా హ్యాపీ అని కూడా మనం అనుకుంటాం. అయితే జూ పార్క్‌లో ఉన్న సింహాలకు కూడా కరోనా సోకిన నేపథ్యంలో ఇప్పుడు జంతువులకు కూడా ముప్పు పొంచి ఉంది. ముందు జాగ్రత్తగా ఏపీలోని జూ పార్క్‌లను రాష్ట్ర అటవీ శాఖ మూసివేసింది. రోజూ తమను చూడటానికి వచ్చే జనం రాకపోయేసరికి అవి కూడా బెంగపెట్టుకున్నాయట. దీంతో వాటి దృష్టి మరల్చేందుకు అటవీ శాఖ అధికారులు వినూత్న ఆలోచన చేశారు. వాటి ఆటవిడుపు కోసం కొన్ని ఆట వస్తువులను అందుబాటులో ఉంచారు.