YV Subba Reddy: బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి
YV Subba Reddy: భక్తులందరికీ విజయదశమి శుభాకాంక్షలు- వైవీ సుబ్బారెడ్డి
భక్తులకు దసరా శుభాకాంక్షలు చెప్పిన వైవీ సుబ్బా రెడ్డి (ఫైల్ ఇమేజ్)
YV Subba Reddy: తిరుమల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్ కారణంగా ఈ ఏడాది కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించామన్నారు. భక్తులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తేలియజేసిన వైవీ సుబ్బారెడ్డి స్వామి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్ధించినట్లు తెలిపారు. త్వరలోనే నేరుగా శ్రీవారి దర్శన టిక్కెట్లు పొందే ఏర్పాట్లు చేస్తామని టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు.