క్యాంప్ ఆఫీస్‌లో మార్గని భరత్, జక్కంపూడితో సుబ్బారెడ్డి సమావేశం

Andhra Pradesh: కొన్ని రోజులుగా ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం

Update: 2021-09-28 11:23 GMT
మార్గాన్ని భరత్ మరియు జక్కంపూడితో వైవీ సుబ్బా రెడ్డి సమావేశం (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: రాజమండ్రి వైసీపీ పంచాయతీ తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్‌కు చేరింది. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇద్దరిని సీఎంను కలిసేందుకు తాడేపల్లికి వచ్చారు ఇటీవల వీరిద్దరు బహిరంగంగా పరస్పర ఆరోపణలు చేసుకోవడం పై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈనేపథ్యంలో విరిద్దరినీ పిలిచి వివరణ తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా పర్యవేక్షకుడు వైవీ సుబ్బారెడ్డికి సీఎం జగన్ ఆదేశించారు. దాంతో వైవీ సుబ్బారెడ్డి ఇద్దరితో విడివిడిగా సమావేశం అయ్యారు వివాదానికి కారణాలు తెలుసుకున్నారరు.. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సుబ్బారెడ్డి ప్రయత్నించారు.

అయితే సమావేశం అనంతరం ఎంపీ మార్గాని భరత్ ఎవ్వరితో మాట్లాడకుండా వెళ్లిపోయారు ఇద్దరి నేతలను ఘాటుగా హెచ్చరించినట్టు తెలుస్తోంది. పార్టీ పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయవద్దని వైవీ హెచ్చరించినట్టు తెలుస్తోంది. వీధిలో పడి విమర్శలు చేసుకుంటే పార్టీతో పాటు వ్యక్తిగతంగా ఇబ్బందులు వస్తాయని సుబ్బారెడ్డి అన్నట్టు తెలుస్తోంది.

ఇటీవల పురషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉండగా కొందరు రైతులతో రాజమండ్రిలో బ్యాంకు ఖాతాలు తెరిపించి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడే ప్రయత్నాలు చేశారని ఎంపీ భరత్‌పై జక్కంపూడి రాజా పరోక్షవిమర్శలు గుప్పించారు. దీనిపై ఎంపీ భరత్ స్పందిస్తూ చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసని తనపై అభియోగాలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఘాటుగా స్పందించారు ఇదే ఇద్దరినేతల మధ్య వార్‌కు కారణమైంది. 

Tags:    

Similar News