YSRCP MP Vijayasai Reddy to quarantine : హోం క్వారంటైన్‌లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి!

YSRCP MP Vijayasai Reddy to quarantine :ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సినీ స్టార్లు, రాజకీయ నేతలు

Update: 2020-07-21 17:09 GMT
MP vijayasai reddy (File Photo)

YSRCP MP Vijayasai Reddy to quarantine : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సినీ స్టార్లు, రాజకీయ నేతలు ఇలా కరోనా బారినపడుతున్నారు. ఇక అటు ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే అధికార వైసీపీ నుంచి పలువురు నేతలు కరోనా బారిన పడ్డారు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి హోం క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయారు. కోవిడ్ ను దృష్టిలో ఉంచుకొని అయన వారం నుంచి 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. అంతేకాకుండా అత్యవసరం అయితే తప్ప టెలిఫోన్‌లో కూడా అందుబాటులో ఉండబోనని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.



ఇక ఏపీలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 4,944 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 37,162 శాంపిల్స్‌ని పరీక్షించగా 4,944 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 1,232 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 62 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 55,773కి చేరుకుంది. ఇక అటు మృతుల సంఖ్య 758గా ఉండగా, కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 22,896 కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 32,119 మంది చికిత్స పొందుతున్నారు. ఇక ఇప్పటి వరకు ఏపీలో 13,86,274 కరోనా శాంపిల్స్ నిర్వహించింది ప్రభుత్వం.

Tags:    

Similar News