Mithun Reddy: జైలు నుంచి విడుదలైన ఎంపీ మిథున్ రెడ్డి

Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఆయనకు ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

Update: 2025-09-30 01:54 GMT

Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఆయనకు ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. వారంలో రెండు రోజులు సిట్ విచారణకు హాజరుకావాలని, అలాగే రెండు షూరిటీలు, రూ. 2 లక్షల పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది. కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి మిథున్‌రెడ్డి విడుదలయ్యారు.

జైలు నుంచి విడుదలైన మిథున్‌రెడ్డికి వైసీపీ నేతలు, శ్రేణులు స్వాగతం పలికారు. ఏపీ లిక్కర్‌ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలతో గత జులై 20వ తేదీన మిథున్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అప్పటి నుంచి అంటే గత 71 రోజులుగా మిథున్ రెడ్డి జైల్లోనే ఉన్నారు. తాజాగా ఏసీబీ కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు.

Tags:    

Similar News