MLA Roja: జగన్ చరిత్ర సృష్టించబోతున్నారు
MLA Roja: ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజనతో ముఖ్యమంత్రి జగన్ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు.
MLA Roja: జగన్ చరిత్ర సృష్టించబోతున్నారు
MLA Roja: ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజనతో ముఖ్యమంత్రి జగన్ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. కొత్తగా ఏర్పడబోయే 13 జిల్లాలతో ప్రజలకు పరిపాలన మరింత చేరువ కానుందని అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజాకు టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు రోజా శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరంలో తెలుగు ప్రజలందరికీ శుభాలు చేకూరాలని దేవుడిని ప్రార్థించినట్లు చెప్పారు రోజా.