Love Marriage: కుమార్తె ప్రేమ వివాహం.. దగ్గరుండి జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే..!
Love Marriage: వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఒక ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు.
Love Marriage: కుమార్తె ప్రేమ వివాహం.. దగ్గరుండి జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే..!
Love Marriage: వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఒక ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. తన కుమార్తె వివాహాన్ని ప్రొద్దుటూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో దగ్గరుండి జరిపించారు. లీలా గోపీ పవన్ కుమార్ అనే వ్యక్తితో తన మొదటి కుమార్తె రాచమల్లు పల్లవి పెళ్లి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ.. తన కుమార్తె ఇష్టప్రకారం వారిని ఆశీర్వదించి ప్రేమ వివాహం జరిపించానన్నారు. కలిసి చదువుకున్న రోజుల్లో ఇష్టపడటంతో పవన్‌తో పెళ్లి చేశామన్నారు. డబ్బు, హోదా, కులానికి విలువ ఇవ్వకుండా వారి ఇష్టప్రకారమే అంగీకరించి వివాహం చేశామని ఎమ్మెల్యే చెప్పారు.