Hindupur: వైసీపీ అసమ్మతి నేత దారుణ హత్య.. 18 చోట్ల నరికిన దుండగులు
Sri Sathya Sai District: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ అసమ్మతి నేత చౌలూరు రామకృష్ణారెడ్డి దారుణ హత్య జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
Hindupur: వైసీపీ అసమ్మతి నేత దారుణ హత్య.. 18 చోట్ల నరికిన దుండగులు
Sri Sathya Sai District: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ అసమ్మతి నేత చౌలూరు రామకృష్ణారెడ్డి దారుణ హత్య జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఇంటి సమీపంలో మాటు వేసిన దుండగులు వేట కొడవళ్ళతో అత్యంత దారుణంగా నరికి చంపారు. రామకృష్ణారెడ్డి సొంత గ్రామం చౌళూరు సమీపంలో కర్ణాటక సరిహద్దులో దాబా నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి దాబా మూసివేసి, కారులో ఇంటికి వచ్చారు. కారు దిగుతుండగా దుండగులు ఆయనపై కారం పొడి చల్లి వేట కొడవళ్లతో 18 చోట్ల దారుణంగా నరికారు.
రామకృష్ణ రెడ్డి హిందూపురం నియోజకవర్గ అసమ్మతి నేతలతో కలిసి కొంత కాలంగా క్యాంపు రాజకీయాలు జరిపారు. చౌలూరి రామకృష్ణారెడ్డి హత్యపై కుటుంబ సభ్యులు, ఆ పార్టీ నాయకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. హత్యపై మృతుడి తల్లి, ఆ పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కావాలనే కొందరు వ్యక్తులు తమ కొడుకును పొట్టన పెట్టుకున్నారని మృతుడి తల్లి ఆరోపిస్తోంది.