Kadapa Mining Blast Case: కడప పేలుళ్ల ఘటనలో వైసీపీ నేత అరెస్ట్

Kadapa Mining Blast Case: ముగ్గురాయి గనుల్లో జరిగిన పేలుళ్ల కేసులో వైసీపీ నేతను పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2021-05-11 03:00 GMT

Kadapa SP:(File Image)

Kadapa Mining Blast Case: ఈనెల 8వ తేదీన కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్ల పల్లె గ్రామంలో ముగ్గురాయి గనుల్లో జరిగిన పేలుళ్లకు సంబంధించిన కేసులో వైసీపీ నేత సి.నాగేశ్వరరెడ్డి, పేలుడు పదార్థాలు సరఫరా చేసిన రఘునాథ్‌రెడ్డిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఈ నెల 8న జరిగిన పేలుళ్లలో 10 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఈ గనిని అసలు లీజుదారైన సి. కస్తూరిబాయి నుంచి బ్రహ్మంగారిమఠం మండలానికి చెందిన సి. నాగేశ్వర్ రెడ్డి 2013లో జీపీఏ తీసుకుని నిర్వహిస్తున్నారు.

దీనికి పర్యావరణ అనుమతులు కూడా లేవని, ఇక్కడ పేలుళ్లు జరపకూడదని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. గని వాస్తవ లీజుదారులకు కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. పేలుడు పదార్థాలు సరఫరా చేసేందుకు రఘునాథరెడ్డికి లైసెన్స్ ఉందని, అయితే వాటి రవాణా విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదని, అందుకనే ఆయననూ విచారిస్తున్నట్టు చెప్పారు. ప్రమాదానికి కారణమైన 1000 జిలెటిన్ స్టిక్స్, 120 డిటోనేటర్లను పులివెందులలో లైసెన్సు ఉన్న వారి వద్ద నుంచి తీసుకున్నారు. కానీ.. వాటిని కారులో తరలించి, గని వద్ద దింపుతుండగా పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News