YCP Rajya Sabha: వైసీపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థులు ఖరారు..?
YCP Rajya Sabha: రాజ్యసభ అభ్యర్ధులపై సీఎం జగన్ కసరత్తు దాదాపు పూర్తైంది.
YCP Rajya Sabha: వైసీపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థులు ఖరారు..?
YCP Rajya Sabha: రాజ్యసభ అభ్యర్ధులపై సీఎం జగన్ కసరత్తు దాదాపు పూర్తైంది. మొత్తం మూడు సీట్లలో పోటీ చేయనుంది వైసీపీ. ఈరోజు సాయంత్రం ముగ్గురి పేర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎంపీలుగా వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి పేర్లు దాదాపు ఖరారు చేసింది అధిష్టానం. ఈ నెల 8తేదీన ఎమ్మెల్యేలతో మాక్ పోలింగ్ నిర్వహించనుంది. ఈ నెలతో సీఎం రమేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రవీంద్రబాబు రాజ్యసభ పదవీ కాలం ముగియనుంది.