Andhra Pradesh: వాహనమిత్ర ఆర్థిక సాయం రేపు విడుదల
Andhra Pradesh: మూడో ఏడాది వైఎస్‌ఆర్ వాహనమిత్ర ఆర్థిక సాయాన్ని ఏపీ ప్రభుత్వం రేపు విడుదల చేయనుంది.
ఏపీ సీఎం జగన్ (ఫొటో ట్విట్టర్)
Andhra Pradesh: మూడో ఏడాది వైఎస్‌ఆర్ వాహనమిత్ర ఆర్థిక సాయాన్ని ఏపీ ప్రభుత్వం రేపు విడుదల చేయనుంది. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ. 10 వేల ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ మొత్తాన్ని సీఎం జగన్ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.48 లక్షల మంది డ్రైవర్లకు రూ.248 కోట్ల ఆర్థిక సాయం అందనుందని ప్రభుత్వం పేర్కొంది
మరోవైపు జగనన్న విద్యాకానుక కిట్‌లో చిన్న సైజ్ ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీని ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వనుంది. నిఘంటువు కొనుగోలు చేసేందుకు పాలనా అనుమతిని ఇచ్చింది. ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న 23.5 లక్షల మందికి నిఘంటువు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.