YSR Nethanna Nestham: నేడు చేనేతలకు వైఎస్సార్‌ నేతన్న నేస్తం

* 80,032 మంది నేతన్నలకు రూ.192.08 కోట్లు * నేరుగా ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్‌ * వరుసగా మూడో ఏడాదీ అమలు

Update: 2021-08-10 02:45 GMT

వై ఎస్ జగన్ (ట్విట్టర్ ఫోటో) 

YSR Nethanna Nestham: చేనేత కార్మికులను ఆదుకునేందుకు వైఎస్సార్‌ నేతన్న నేస్తం అమలుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. వరుసగా మూడో ఏడాది నేతన్నకు ఆపన్న హస్తం అందించేలా వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం అమలుకు సీఎం జగన్‌ ఆదేశించారు. ఈ ఏడాది వైఎస్సార్‌ నేతన్న నేస్తం కింద అర్హులైన 80వేల32 మంది నేతన్నలకు 192.08 కోట్లను సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.

మగ్గం కలిగిన, అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 24 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. ఐదేళ్లలో ప్రతి లబ్ధిదారుడికి లక్షా, 20 వేలచొప్పున ఆర్థిక సాయం అందనుంది. ఇప్పటికే 2 విడతల్లో సాయం అందగా తాజాగా మూడో విడత సాయాన్ని అందచేయడం ద్వారా అర్హులైన ప్రతి నేతన్నకు 72వేలచొప్పున ప్రయోజనం చేకూరనుంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నేతన్నలకు ప్రభుత్వం 383.99 కోట్లు అందచేసింది. ఇవాళ మూడో విడత కింద ఇచ్చే 192.08 కోట్లతో కలిపితే నేతన్నలకు 576.07 కోట్ల సాయం అందించినట్లయింది.

Tags:    

Similar News