వైఎస్‌ఆర్‌ 'లా నేస్తం' నిధులు విడుదల

* క్యాంప్‌ ఆఫీస్‌లో బటన్‌ నొక్కి నిధులు విడుదల చేసిన సీఎం జగన్‌

Update: 2023-02-22 07:45 GMT

వైఎస్‌ఆర్‌ 'లా నేస్తం' నిధులు విడుదల

YSR Law Nestham: గత మూడేళ్లుగా 'లా నేస్తం' నిధులను విడుదల చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. లాయర్లకు ప్రభుత్వం తోడుగా ఉందని తెలిపేందుకు 'లా నేస్తం' అని సీఎం అన్నారు. లా డిగ్రీ తీసుకున్న తర్వాత తొలి మూడేళ్లు న్యాయవాదిగా స్థిరపడేందుకు 'లా నేస్తం' కచ్చితంగా ఉపయోగపడుతుందని తెలిపారు. క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి 'లా నేస్తం' నిధులను జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లోకి సీఎం జగన్ జమ చేశారు. మూడున్నరేళ్లలో 4వేల 248 మంది లాయర్లను ప్రతినెలా ఆదుకున్నామన్న సీఎం 35కోట్ల 40 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించామన్నారు. ప్రతీ జూనియర్ న్యాయవాదికి నెలకు 5వేల చొప్పున మూడేళ్ల పాటు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు.

Tags:    

Similar News