పొదుపు సంఘాల తొలివిడత అప్పు చెల్లింపు నేడు

నవరత్నాలలో మరో రత్నమైన 'వైఎస్ఆర్ ఆసరా' పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు..

Update: 2020-09-11 02:02 GMT

నవరత్నాలలో మరో రత్నమైన 'వైఎస్ఆర్ ఆసరా' పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్‌ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల రోజు నాటికి (2019 ఏప్రిల్‌ 11) పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే అప్పు మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లించే ఈ పథకానికి శ్రీకారం చుట్టిన జగన్.. నేడు దీనిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. మొత్తం 8,71,302 పొదుపు సంఘాల్లో 87,74,674 మంది మహిళల పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు రూ.27,168.83 కోట్లు..

దీనిని నాలుగు విడతల్లో జమ చేయనుంది. తొలి విడతలో రూ.6,792.20 కోట్లను నేడు జమ చేయనుంది. వైఎస్సార్‌ ఆసరా పథకం ప్రారంభోత్సవాన్ని వారం రోజుల పాటు ఉత్సవంలా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలావుంటే 2019 ఏప్రిల్ 11 తేదీ వరకు పెండింగ్​లో ఉన్న బ్యాంకు లింకేజీ లోన్స్‌కు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ఏపీ స‌ర్కార్ వెల్లడించింది. ఏప్రిల్ 11 , 2019 తేదీ కంటే ముందు నిరర్థక ఆస్తులుగా ప్రకటించింది. ఇప్పటికే నిలిపివేసిన ఎస్​హెచ్​జీ అకౌంట్ల‌కు ఆసరా పథకం వర్తించదని పేర్కొంది.

Tags:    

Similar News