YSR Asara Scheme: ఇవాళ YSR ఆసరా మూడో విడత సాయం

YSR Asara Scheme: బటన్ నొక్కి పొదుపు సంఘాల ఖాతాల్లో నగదు జమ

Update: 2023-03-25 04:08 GMT

YSR Asara Scheme: ఇవాళ YSR ఆసరా మూడో విడత సాయం 

YSR Asara Scheme: ఇవాళ ఏపీ సర్కార్ వైఎస్సార్ ఆసరా పథకంతో మూడో విడత సాయాన్ని విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి జగన్ దెందులూరులో బటన్ నొక్కి పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో నిధులను జమచేయనున్నారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద 78 లక్షల 94 వేల మంది పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో 6వేల 419 కోట్ల 89లక్షలను సీఎం జగన్ జమ చేయనున్నారు. ఏలూరు జిల్లా దెందులూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

2019 సార్వత్రిక ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తాన్ని ప్రభుత్వమే ఇప్పటి వరకూ చెల్లిస్తూ వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో 25 వేల571 కోట్ల అప్పు ఉంది. ఇప్పటికే రెండు విడతల్లో 12 వేల 758కోట్ల 28లక్షల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది. తాజాగా వరుసగా మూడో ఏడాది నగదు జమ చేయనున్నారు. 

Tags:    

Similar News