Y. S. Vivekananda Reddy Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై దర్యాప్తు ప్రారంభం

Y. S. Vivekananda Reddy Murder Case: మాజీ మంత్రి వైఎస్ వికానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2020-07-18 16:15 GMT
YS Vivekananda Reddy (File Photo)

Y. S. Vivekananda Reddy Murder Case: మాజీ మంత్రి వైఎస్ వికానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకానందరెడ్డి హత్యపై సిబిఐ విచారణ ప్రారంభించింది. హైకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన సిబిఐ.. కడప ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అన్బురాజన్ తో అధికారులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏడుగురు సభ్యులున్న సిబిఐ అధికారులు పాల్గొన్నారు. వైఎస్ వివేకా హత్యపై విచారణ జరపాలని కుమార్తె సునీతారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దాంతో నాలుగునెలల క్రితమే సిబిఐ విచారణకు కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో సిబిఐ అధికారులు పులివెందుల వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే వివేకా హత్య కేసులో ముగ్గురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు. పదమూడు వందలమంది అనుమానితులను సిట్ విచారించింది.

వై.ఎస్.వివేకానందరెడ్డి ఆంధ్రప్రదేశ్ 9వ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి స్వయానా సోదరుడు.. ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డికి చిన్నాన్న. 1989, 1994 ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో 90వేలు, 2004లో లక్షా పదివేల మెజార్టీలతో కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. 2009లో తాను ఎన్నికవుతూ వచ్చిన కడప లోక్ సభ స్థానాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విడిచిపెట్టి, ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా ఎంపికయ్యారు. అనంతరం మంత్రిగా కూడా పనిచేశారు. వివేకానందరెడ్డి 2019 మార్చి 15 తెల్లవారేసరికల్లా పులివెందులలోని తన స్వంత ఇంట్లో అనుమానాస్పద రీతిలో మరణించారు. పోస్టుమార్టం అనంతరం ఆయనది హత్యగా తేల్చారు పోలీసులు.


Full View


Tags:    

Similar News