YS Sharmila: చంద్రబాబు-జగన్.. ఇద్దరూ బీజేపీకి తొత్తులే..

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు.

Update: 2024-01-21 10:19 GMT

YS Sharmila: చంద్రబాబు-జగన్.. ఇద్దరూ బీజేపీకి తొత్తులే..

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. కానూరులోని కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ఆమె బీజేపీ, వైసీపీ, టీడీపీలపై తీవ్రమైన విమర్శలు చేశారు. గత పదేళ్లలో ఆ రెండు పార్టీల పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదన్నారు. విజయవాడలో పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. పార్టీలోకి తాను రావాలని కేడర్‌ కోరుకుందని.. వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. గత పదేళ్లలో రాష్ట్రానికి పది పరిశ్రమలైనా వచ్చాయా? అని ప్రశ్నించారు. ఉద్యోగాల ఇస్తామని చెప్పి.. ఏపీ ప్రజలను బీజేపీ మోసం చేసిందన్నారు.

బీజేపీకి వైసీపీ, టీడీపీ అమ్ముడుపోయాయని ఆరోపించారు. ప్రజల దగ్గర బీజేపీతో మాకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తారని మండిపడ్డారు. కానీ ఈ రెండు పార్టీలు బీజేపీ తొత్తులేనని విమర్శించారు. బీజేపీతో టీడీపీ-వైసీపీలు పరోక్షంగా పొత్తులు పెట్టుకున్నాయని పేర్కొన్నారు. బీజేపీ ఏం చేసిందని ఆ పార్టీకి వైసీపీ, టీడీపీలు మద్దతిస్తున్నాయి..? అని ప్రశ్నించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని విమర్శంచారు. ఎక్కడ చూసినా దోచుకోవడం.. దాచుకోవడమే ఉందన్నారు. భూతద్దంలో వెతికి చూసినా ఏపీలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దళితుల మీద దాడులు పెరిగాయన్నారు.

Tags:    

Similar News