YS Sharmila: కాంగ్రెస్‌కు బేషరతు మద్దతు.. సంచలన ప్రకటన చేసిన షర్మిల
YS Sharmila: కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదనే నిర్ణయన్న షర్మిల
YS Sharmila: కాంగ్రెస్‌కు బేషరతు మద్దతు.. సంచలన ప్రకటన చేసిన షర్మిల
YS Sharmila: మరికొన్ని రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వైఎస్సార్‌టీపీ అధినేత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని షర్మిల ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ను ఓడించేందుకు నిర్ణయం తీసుకున్నామన్న షర్మిల.. అందులో భాగంగా భేషరతుగా తమ మద్దతు కాంగ్రెస్‌కు ఉంటుందన్నారు.
తాము పోటీ చేస్తే.. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలుతుందని.. అలా జరగడం వల్ల మళ్లీ ఆయనే సీఎం అయ్యే అవకాశం ఉందన్నారు. అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు షర్మిల. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచాక తెలంగాణలో కూడా గ్రాఫ్ పెరిగిందని, కాంగ్రెస్ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని షర్మిల అన్నారు.