YS Jagan : వైఎస్ జగన్ పుత్రికోత్సాహం.. చిన్న కూతురికి అభినందనలతో ..ప్రత్యేక ట్వీట్

Update: 2025-01-17 02:55 GMT

YS Jagan - Daughter: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశాల్లో పర్యటిస్తున్నారు. కుటుంబ సమేతంగా విదేశీ టూర్ కు వెళ్లారు. ఆయన చిన్న కూతురి డిగ్రీ ప్రదానోత్సవం సందర్భంగా లండన్ కు వెళ్లారు వైఎస్ జగన్. జనవరి 16వ తేదీన జరిగిన వర్షారెడ్డి కాన్వకేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా జగన్ ట్విట్టర్ లో పోస్తు చేశారు. అందులో ఇద్దరు కూతుళ్లు హర్షారెడ్డి, వర్షా రెడ్డి తోపాటు భార్య వైఎస్ భారతితో దిగిన ఫ్యామిలీ ఫొటోను షేర్ చేశారు. చిన్నకూతురు వర్షారెడ్డి డిగ్రీ పూర్తి చేయడంతో శుభాకాంక్షలు తెలుపుతూ కంగ్రాట్యులేషన్స్ డియర్..నువ్వు ప్రఖ్యాత విద్యాసంస్థ లండన్ కింగ్స్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసినందుకే కాదు..అదికూడా డిస్టింక్షన్ లోపాస్ అయినందుకు అభినందనలు. మిమ్మల్ని గర్వపడే విధంగా చేశావు. గాడ్ బ్లెస్ యూ డియర్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.


Tags:    

Similar News