YS Jagan: వైఎస్సార్‌ జిల్లాలో ఇవా‎ళ ఏపీ సీఎం జగన్‌ పర్యటన

YS Jagan: జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్లాంటుకు భూమిపూజ చేయనున్న సీఎం

Update: 2023-02-15 03:15 GMT

YS Jagan: వైఎస్సార్‌ జిల్లాలో ఇవా‎ళ ఏపీ సీఎం జగన్‌ పర్యటన

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ల పల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్లాంటుకు భూమిపూజ, పులివెందులలో ఓ వివాహ రిసెప్షన్‌ వేడుకకు హాజరు కానున్నారు. ఇవాళ ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ల పల్లె చేరుకుంటారు. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్లాంటుకు సంబంధించి భూమిపూజ, శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడే స్టీల్‌ ప్లాంటు మౌలిక సదుపాయాలపై సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు పులివెందుల చేరుకుంటారు. అక్కడి ఎస్‌సీఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో మూలి బలరామిరెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. సాయంత్రం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Tags:    

Similar News