వల్లభనేని వంశీని విజయవాడ జైలులో పరామర్శించిన జగన్
YS Jagan: వైఎస్ జగన్ మంగళవారం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించారు.
వల్లభనేని వంశీని విజయవాడ జైలులో పరామర్శించిన జగన్
YS Jagan: వైఎస్ జగన్ మంగళవారం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించారు. విజయవాడ జిల్లా జైలులో ఉన్న ఆయనతో జగన్ భేటీ అయ్యారు.
కిడ్నాప్, బెదిరింపు ఆరోపణలతో ఫిబ్రవరి 13న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేశారని ఆయనపై నమోదైన కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
2023 ఫిబ్రవరి 20న గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వంశీ వర్గీయులు దాడి చేశారని అప్పట్లో టీడీపీ ఫిర్యాదు చేసింది. సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై అప్పట్లో పోలీసులు పట్టించుకోలేదని టీడీపీ విమర్శలు చేసింది. ఈ కేసు దర్యాప్తును చంద్రబాబు ప్రభుత్వం సిట్ కు అప్పగించింది.
టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ కోర్టులో ఈ కేసును విత్ డ్రా చేసుకున్నట్టు అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ తర్వాత సత్యవర్ధన్ కన్పించకుండా పోయారు. సత్యవర్ధన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విశాఖపట్టణంలో ఉన్న సత్యవర్ధన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు.