CM Jagan: నేను చేయాల్సింది నేను చేస్తా.. మీరు చేయాల్సింది మీరు చేయాలి..

YS Jagan: ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలనుకోవడం లేదు

Update: 2023-04-03 09:14 GMT

YS Jagan: ఎమ్మెల్యేలు, మంత్రులతో ముగిసిన సీఎం జగన్ భేటీ

YS Jagan: పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో సీఎం జగన్ భేటీ ముగిసింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఎమ్మెల్యేలకు జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సెప్టెంబర్ 1 వరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలనుకోవడం లేదని.. మీతో పని చేయించి.. మిమ్మల్ని గెలిపించాలనే ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రజల్లో మీ గ్రాఫ్ సరిగ్గా లేకపోతే పార్టీకి, కేడర్ కు నష్టమని సూచించారు.

నేను చేయాల్సింది నేను చేస్తా.. మీరు చేయాల్సింది మీరు చేయాలని.. ఈ రెండూ సంయుక్తంగా జరిగితే కచ్చితంగా 175 స్థానాలకు 175 గెలుస్తామన్నారు సీఎం జగన్. ఉన్నది లేన్నట్టు.. లేనది ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారని.. రాబోయే రోజుల్లో ఇంకా రూమర్లు ప్రచారం చేస్తారన్నారు సీఎం జగన్. ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్ చేసి విషప్రచారం చేస్తారని.. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలన్నారు. సోషల్ మీడియా క్యాంపెయిన్ ను ఉధృతం చేయాలని సూచించారు. 

Tags:    

Similar News