YSR Rythu Bharosa: రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్
YSR Rythu Bharosa: వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం ద్వారా మూడో ఏడాది తొలి విడత సాయం విడుదల చేశారు సీఎం జగన్.
జగన్(ఫైల్ ఇమేజ్ )
YSR Rythu Bharosa: వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం ద్వారా మూడో ఏడాది తొలి విడత సాయం విడుదల చేశారు సీఎం జగన్. తొలి విడతగా ఒక్కో రైతుకు 7వేల 500 సాయం చొప్పున.. నేరుగా బ్యాంక్ అకౌంట్లలోకి నగదు జమ చేశారు. కోవిడ్ కష్టకాలంలోనూ రైతులకు అండగా ఉన్నామన్న జగన్ ప్రతి ఏటా మూడు విడతల్లో 13వేల 500 పెట్టుబడి సాయం అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 13వేల 101 కోట్లు రైతుల అకౌంట్‌లో జమ చేసినట్టు చెప్పారు సీఎం జగన్.