చంద్రబాబుకు ఝలక్.. వృద్ధాప్య పింఛన్‌ రూ.3వేలకు పెంచుతూ జగన్ ప్రకటన

Update: 2019-02-06 12:10 GMT

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రతిపక్షనేత వైయస్ జగన్ ఝలక్ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే వృద్ధాప్య పింఛను రూ. 3 వేలు చేస్తామని ప్రకటించారు. దీంతో టీడీపీ నేతలు షాక్ అయ్యారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అవ్వా, తాతలకు నెలకు రూ.3 వేలు వృద్ధాప్య పింఛన్‌ ఇస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. బుధవారం తిరుపతి సమీపంలో జరిగిన వైఎస్సార్‌ సీపీ సమర శంఖారావం సభలో ఆయన హామీ ఇచ్చారు.

అంతేకాకుండా రైతులను ఆదుకునేందుకు ప్రతి మే నెలలో రూ.12,500 సాయం అందిస్తామని తెలిపారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే సీఎం చంద్రబాబు తాయిళాలు ప్రకటిస్తున్నారని విమర్శించారు. పసుపు కుంకుమ పేరుతో మహిళలను మోసం చేశారని ఆరోపించారు. ఐదేళ్లలో రైతుల గురించిన పట్టించుకోని బాబు.. ఎన్నికలు సమీపిస్తుండడంతో రైతులకు ఆర్ధికసాయం అంటూ కొత్త డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. 

Similar News