స్వయం ఉపాధిని ప్రోత్సాహించేందుకు వారికోసం బైక్ లు..

Update: 2019-11-17 04:58 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. శారీరక వికలాంగులకు త్రీ వీలర్ బైక్‌లను ఉచితంగా ఇవ్వాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో స్వయం ఉపాధిని ప్రోత్సాహించడానికి ప్రభుత్వం ఉచిత మూడు చక్రాల వాహనాలను అందిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రభుత్వం 2500 మందికి రూ .22 కోట్లతో ఈ వెహికల్స్ ను కొంటోంది.

ఈ త్రీ వీలర్ బైక్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారాలను డౌన్లోడ్ చేసుకొని.. పూర్తిగా నింపి విలేజ్ వాలంటీర్లకు సమర్పించాలి. అలాగే ప్రభుత్వం ఇచ్చిన ఫారం పూర్తి చేయాలి. లబ్ధిదారుడి ఆధార్ కార్డు మరియు వైట్ రేషన్ కార్డును ప్రభుత్వ ధృవీకరణ పత్రంతో జతచేయాలి. దరఖాస్తుదారుల వివరాలను పూర్తిచేసిన తరువాత ప్రభుత్వం వాటిని పరిశీలిస్తుంది.

keywords :ys jagan,three wheeler bike, physically challenged

Tags:    

Similar News