Vijayawada: పీవీపీ మాల్‌ ఐదో అంతస్తు పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య

Vijayawada: మృతుడు మాల్‌లోని బార్బీ క్యూలో పనిచేసే దాస్‌గా గుర్తింపు

Update: 2022-12-21 08:45 GMT

Vijayawada: పీవీపీ మాల్‌ ఐదో అంతస్తు పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య

Vijayawada: విజయవాడలో యువకుడి సూసైడ్‌ కలకలం రేపింది. పీవీపీ మాల్‌ ఐదో అంతస్తు పైనుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పీవీపీ మాల్‌లోని బార్బీక్యూలో పనిచేసే ఒడిశాకు చెందిన దాస్‌గా గుర్తించారు. ఆత్మహత్యకు ముందు.. బార్బీ క్యూ సహ ఉద్యోగి, యువకుడి మధ్య వివాదం జరిగినట్టు సమాచారం. దీంతో దాస్‌ని బార్బీ క్యూ యజమాని మందలించినట్టు తెలుస్తోంది. ఇది జరిగిన కాసేపటికే దాస్‌ మృతి చెందాడు. అయితే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిది ఆత్మహత్యా..? లేక హత్యా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News