Vijayawada: విజయవాడ కృష్ణానదిలో యువకులు గల్లంతు
Vijayawada: భవనీపురం సూరనా ఘాట్ వద్ద ఘటన * స్నేహితులతో కలిసి కృష్ణానదిలో దిగిన యువకులు
Representational Image
Vijayawada: విజయవాడ కృష్ణానదిలో యువకులు గల్లంతు అయ్యారు. భవనీపురం సూరనా ఘాట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. స్నానం చేసేందుకు ముగ్గురు స్నేహితులు నదీలోకి దిగారు. వారిలో వరద ప్రవాహానికి రాజశేఖర్ అనే యువకుడు గల్లంతు అయ్యారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతయిన యువకుడు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. రెస్క్యూ ఆపరేషన్ చేసి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.