దేశంలో ఎక్కడ హవాలా బయటపడ్డా చంద్రబాబు పేరు.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడ హవాలా డబ్బు బయటపడిన చంద్రబాబు పేరు వినిపిస్తోందని ఆరోపణలు చేశారు.

Update: 2020-03-08 08:09 GMT
Vijaya Sai Reddy File Photo

టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రిజర్వేషన్లపై కోర్టుకు వెళ్లింది టీడీపీ కాదా? అని ప్రశ్నించారు. బీసీలకు సీఎం జగన్ 34% రిజర్వేషన్లు కల్పిస్తామని భరోసా ఇచ్చారని అన్నారు. కోర్టుకు వెళ్లి రిజర్వేషన్లు 0% దాటరాదని తీర్పు తెచ్చుకున్నారని విమర్శించారు. దేశంలో ఎక్కడ హవాలా, లాండరింగ్ బయటపడ్డా చంద్రబాబు పేరు వినిపిస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా వరుస ట్వీట్లు వదిలారు.

రిజర్వేషన్లు 50% దాటరాదని కోర్టుకు వెళ్లి తీర్పు తెచ్చుకున్నారు. సిఎం జగన్ గారు పార్టీ పరంగా బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 59.85% అణగారిన వర్గాలకు బి-ఫారాలు ఇస్తారు. ఈ మాట ముందే చెప్పడానికి నోరెందుకు పెగల్లేదు బాబూ. బీసీలపై నీదెప్పుడూ కపట ప్రేమే కదా! అంటూ ట్వీట్ చేశారు.

కాగా మరో ట్వీట్‌లో.. రాష్ట్రంలోని 1.62 కోట్ల కుటుంబాలకు సంక్షేమ సాయం అందింది. ఏటా 16 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చినా సిఎం జగన్ గారు వెనకడుగు వేయలేదు. నీ జమానాలో ప్రజలను ఈ విధంగా ఆదుకునే ప్రయత్నం చేశావా? సంతృప్త స్థాయిలో ఏ పథకమైనా అమలు చేశావా? ఎలక్షన్లకు ముందు ప్రలోభ పెట్టడం తప్ప.' అంటూ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.

మరో ట్వీట్‌లో Yes Bank పైన చంద్రబాబు అంత ప్రేమ కనబర్చారంటేనే అవతవకలు జరిగినట్టు ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్ పై ఈడి కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ పై దర్యాప్తు జరుగుతోంది. దేశంలో ఎక్కడ హవాలా, లాండరింగ్ బయటపడ్డా బాబు పేరు వినిపిస్తోంది.




Tags:    

Similar News