గ్రామ వలంటీర్లెంత? వాళ్ల జీతాలెంత?.. విజయసాయిరెడ్డి ట్వీట్

గ్రామ వలంటీర్లెంత? వాళ్ల జీతాలెంత? పెళ్లి చేసుకోవాలంటే సంబంధం కూడా దొరకదని హేళన చేశాడు చంద్రబాబు.

Update: 2020-03-02 10:28 GMT
Vijaya sai Reddy And Chandrababu File photo

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు గతంతలో గ్రామ వాలంటీర్ల గురించి తక్కువ చేసి మాట్లాడారని గుర్తు చేశారు. రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నికైయ్యాక వాలంటీర్లను నియమించిన సంగతి తెలిసిందే. వాలంటీర్లపై చంద్రబాబు వ్యాఖ్యలను తప్పబడుతూ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. గ్రామ వలంటీర్లెంత? వాళ్ల జీతాలెంత? పెళ్లి చేసుకోవాలంటే సంబంధం కూడా దొరకదని హేళన చేశాడు చంద్రబాబు. అప్రయోజకుడైన ఆయన పుత్రరత్నం నాలుగున్నర లక్షల మంది వలంటీర్లలో ఒక్కరితో కూడా సరితూగలేడు. సిఎం జగన్ గారు అప్పగించిన బాధ్యతను సైనికుల్లా నిర్వర్తిస్తున్నారు. హాట్సాఫ్. అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

చంద్రబాబుపై తరచూ ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. మరో ట్వీట్ లో 'తండ్రి అధికారం పోయింది. ఎమ్మెల్సీ పదవి రేపోమాపో ఊడుతుంది. ఇంకో పక్క అక్రమ సంపాదనల డొంక కదులుతుంటే చిట్టి నాయుడు సైకోపాత్(Psychopath)లా మారిపోయాడు. చీకట్లో కూర్చుని అందరిపైకి రాళ్లు, పిడకలు విసురుతున్నాడు. బయటకొచ్చి మాట్లాడు చిట్టీ, నీ కామెడీ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.' అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.



Tags:    

Similar News