జేఏసీ వాళ్ల చేతిలో కారం ప్యాకెట్లు ఎందుకు.. నాకు ఏమైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత

తనకు ఏదైనా జరిగితే చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌దే బాధ్యత అని గతంలోనే చెప్పానని ఎంపీ నందిగం సురేష్‌ వ్యాఖ్యానించారు.

Update: 2020-02-24 13:06 GMT
Nandigam Suresh

తనకు ఏదైనా జరిగితే చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌దే బాధ్యత అని గతంలోనే చెప్పానని ఎంపీ నందిగం సురేష్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేష్ తనను అంతం చేయాలని చూస్తున్నారని ఎంపీ నందిగం సురేశ్‌ ఆరోపించారు. అమరావతిలో తనపై చంద్రబాబే దాడి చేయించారని, ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు... అమరావతి జేఏసీ ముసుగులో టీడీపీ మహిళా కార్యకర్తలు తనపై దాడి చేశారని అన్నారు.

అమరావతి రథోత్సవంలో మండలం లేమల్లె గ్రామంలో కొందరూ ఎంపీపై దాడి చేసిన విషయం తెలిసిందే. రథోత్సవంలో తాను నడుచుకుంటూ వెళ్తుంటే కొందరూ వచ్చి దూషించారనీ, తన వద్దకు వచ్చి కొందరు జై అమరావతి అంటూ.. గట్టిగా నినాదాలు చేశారన్నారు. జేఏసీ పేరుతో తిరిగే వాళ్లకు కారం ప్యాకెట్లు ఎందుకు? పట్టుకొని తిరుగుతున్నారని అన్నారు. లేళ్ల అప్పిరెడ్డి కారుపై కూడా దాడికి యత్నించారని తెలిపారు. రథోత్సవంలో పాల్గొనేందుకు కొందరు దాడి చేసినా సంయమనం పాటించామని తెలిపారు. ఈ క్రమంలోనే తన కారు ఓ పెద్దాయనను ఢీకొందనీ వెంటనే ఆస్పత్రికి తరలించామని ఎంపీ సురేష్‌ వివరించారు.

కారం చల్లి గన్‌మెన్లు, సిబ్బందిపై దాడి చేశారు. అమరావతి ప్రజలు బలి అవుతున్నారని తెలిపారు. వారంతా టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులేనని సురేశ్‌ వ్యాఖ్యానించారు. రాజధాని మీ అబ్బ సొత్తు కాదని, అమరావతి చంద్రబాబు బినామిల రాజధాని. ఇప్పటికైనా కొన్ని మీడియా చానల్లు వాస్తవాలు రాయాలని ఆయన అన్నారు. చంద్రబాబుకు ప్రజలు ఛీ కొట్టినా సిగ్గు రాలేదని నందిగం సురేశ్ ఆరోపించారు. అమరావతిలో ప్రాణ భయంతో పారిపోయే పరిస్థితి నెలకొంది. అమెరికా నుంచి ఫోన్లు వస్తున్నాయి. నీ అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారని ఎంపీ సురేశ్ అన్నారు.

  

Tags:    

Similar News