పవన్‌కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్న బాలశౌరి
Jana Sena: భారీ ర్యాలీగా పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్న బాలశౌరి
పవన్‌కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్న బాలశౌరి
Jana Sena: మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు బాలశౌరి నేడు జనసేనలో చేరనున్నారు. ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరి పవన్ కల్యాణ్‌ను కలిసి రాజకీయ విషయాలపై చర్చించారు. ఈరోజు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన చేరనున్నారు. తిరిగి పోటీ... వచ్చే ఎన్నికల్లో తిరిగి బాలశౌరి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్నాయి.
వైసీపీ అధినాయకత్వంపై అసంతృప్తితో రాజీనామా చేసిన బాలశౌరి జనసేనలో చేరి వచ్చే ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో బాలశౌరి అనుచరులు పార్టీలో చేరనున్నారు. గుంటూరు నుంచి ర్యాలీగా బయలుదేరి ఆయన జనసేన కార్యాలయానికి చేరుకుంటారు.