మరో వైసీపీ ఎంపీకి కేంద్ర పదవి..

Update: 2019-07-31 15:43 GMT

కేంద్ర ప్రభుత్వం వైసీపీ ఎంపీలకు పదవులు ఇస్తూ పోతోంది. గతంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ప్యానల్ స్పీకర్ పదవి ఇచ్చారు. తరువాత ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఎస్టిమేట్ కమిటీ సభ్యునిగా ఎంపిక చేశారు. ఇక రాజ్యసభ సభ్యుడు, వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డికి మంగళగిరి ఎయిమ్స్ సభ్యునిగా కీలక పదవి అప్పచెప్పారు. ఇప్పుడు ఆ వంతు అమలాపురం ఎంపీ చింతా అనురాధకు వచ్చింది.

కోకోనట్ బోర్డ్ లో సభ్యురాలిగా అనురాధను నియమిస్తున్నట్టు లోక్ సభ సెక్రటేరియెట్ అధికారికంగా ప్రకటించింది. కోనసీమ కు చెందిన ఒక ఎంపీకి కోకోనట్ బోర్డులో సభ్యురాలి అవకాశం రావడం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో కొబ్బరి పంట ఎక్కువ. ఇక్కడి కొబ్బరి రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం అనురాధకు దక్కింది.


Tags:    

Similar News