అంతా అనంతనే.. 14 రోజుల రిమాండ్.. రాజమండ్రి సెంట్రల్‌ జైలు...

Anantha Udaya Bhaskar: అనంతబాబుకి వైద్యపరీక్షలు నిర్వహించి జడ్జీ ముందు ప్రవేశపెట్టిన పోలీసులు...

Update: 2022-05-24 05:57 GMT

అంతా అనంతనే.. 14 రోజుల రిమాండ్.. రాజమండ్రి సెంట్రల్‌జైలు...

Anantha Udaya Bhaskar: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మెజిస్ట్రేట్‌ 14 రోజుల రిమాండ్ విధించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. అనంతరం వైద్యపరీక్షలు నిర్వహించి జడ్జీ ముందు ప్రవేశపెట్టారు. కేసు విచారించిన జడ్జి.. అనంతబాబుకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు ఏసీపీ ఆఫీసుకు కూడా వెళ్లారు. అనంతబాబును పోలీసులు రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు.

ఈ నెల 19న డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు చంపి మృతదేహాన్ని కారులో ఉంచి వదిలి వెళ్లాడు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత వ్యవహారాల్లో సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకోవడంతో తానే హత్య చేసినట్లు అనంతబాబు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. తాను కావాలనే హత్య చేయాలేదని బెదిరించి వదిలేద్దామన్నుట్లు అనంతబాబు పోలీసులతో చెప్పారట.

సుబ్రహ్మణ్యం వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్‌గా పనిచేసి, కొద్ది నెలల క్రితమే మానేశాడు. గురువారం రాత్రి సుబ్రహ్మణ్యం తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి తర్వాత రోడ్డు ప్రమాదంలో సుబ్రహ్మణ్యం చనిపోయాడని సోదరడికి స్వయంగా ఎమ్మెల్సీ ఫోన్ చేసి చెప్పారు. కొద్దిసేపటికే సుబ్రహ్మణ్య డెడ్‌బాడీని కారులో ఇంటి దగ్గరకు తీసుకొచ్చారు. సుబ్రహ్మణ్యంను విగతజీవిగా చూసి కుటుంబసభ్యుల షాక్ తిన్నారు. సుబ్రహ్మణ్యం డెడ్‌బాడీని గమనించి ఎమ్మెల్సీ అనంతబాబే హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. దీనిపై రోజంతా పెద్ద హైడ్రామా నడిచింది. 

Tags:    

Similar News