Andhra Pradesh: పవన్ కల్యాణ్ ట్వీట్‌పై వైసీపీ మంత్రుల కౌంటర్
*ప్యాకేజీ కోసం మొరిగే వాళ్లకి గర్జన అర్ధమవుతుందా?- అంబటి రాంబాబు *దత్త తండ్రి తరపున.. దత్త పుత్రుడి మియావ్ మియావ్..!- గుడివాడ అమర్నాథ్
పవన్ కల్యాణ్ ట్వీట్‌పై వైసీపీ మంత్రుల కౌంటర్
Andhra Pradesh: పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌పై వైసీపీ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. ప్యాకేజీ కోసం మొరిగే వాళ్లకి గర్జన అర్ధమవుతుందా అంటూ మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ట్వీటర్ ద్వారా పవన్‌కు కౌంటర్ ఇచ్చారు. దత్త తండ్రి చంద్రబాబు తరపున.. దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ మియావ్ మియావ్ అంటూ గుడివాడ అమర్నాథ్ ట్వీట్ ద్వారా వ్యంగ్యం ప్రదర్శించారు. అంతర్జాతీయ రాజధాని మాస్కో, జాతీయ రాజధాని ముంబయి, పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్.. ఇవే దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ త్రీ క్యాపిటల్స్ అంటూ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.