Gorantla Madhav: టీడీపీకి ఓటేసిన పాపానికి ఇలాంటి శిక్షా?బాలయ్యపై ఫైర్
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Gorantla Madhav , MLA Nandamuri Balakrishna
Gorantla Madhav: ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలగుదేశం పార్టీకి ఓటేసిన పాపానికి అభిమానులు చావు దెబ్బలు తినాలా అన్ని ప్రశ్నించారు. ఇలాంటి ఉదంతాలను ఎవ్వరూ సమర్దించరని అన్నారు. రాత్రికి మందు తాగడం, పగలు ప్రజలను కొట్టడం బాలకృష్ణకు అలవాటుగా మారిందంటూ ఎంపీ షాకింగ్ కామెంట్స్ చేశారు. బాలకృష్ణ ఓ ప్రజా ప్రతినిధిగా ఎలాంటి సందేశం ఇస్తున్నారో అర్థం కావడం లేదంటూ విమర్శలు గుప్పించారు. వైసీపీ అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాస్‌కు మద్దతుగా గోరంట్ల మాధవ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
హిందూపురం మున్సిపల్ ఎన్నికల లో బాలకృష్ణ(Nandamuri Balakrishna) విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య ఓ అభిమానిపై దాడి చేసిన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. గతంలో కూడా ఎన్నిక ప్రచారం సందర్భంగా బాలయ్య అభిమానులపై చేయిచేసుకున్న సందర్భాలున్నాయి. అయితే తాజా ఉదంతంపై పలు రాజకీయపార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు బాలయ్య వల్ల జరిగిన డ్యామేజ్ ను కవర్ చేసుకునే పనిలో టీడీపీ నేతలు నిమగ్నమయ్యరు. ఈ సందర్బంగా ఆ అభిమాని చేత మాట్లాడించారు.
రాజకీయాలతోపాటు పలు సినిమాల్లో బిజీ బిజీగా ఉంటున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో BB3 అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో రూపొందుతున్న రూపొందిస్తున్నారట.