YCP: రేపటి నుంచి గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమం
YCP: గత ఎన్నికల్లో ఓటమి పాలైన 24 నియోజకవర్గాలపై వైసీపీ ఫోకస్
రేపటి నుంచి గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమం
YCP: గత ఎన్నికల్లో ఓటమి పాలైన 24 నియోజికవర్గాలుపై వైసీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో ఓటమి చెందిన సీట్లపై పార్టీ దృష్టి సారించింది. రేపటి నుంచి గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమం నిర్వహణ నేపథ్యంలో ఇన్‌చార్జ్‌ల విషయంలో క్లారిటీ ఇచ్చింది. పర్చూరు వైసీపీ ఇన్‌చార్జ్‌గా గాదె మధుసూధనరెడ్డికి ఛాన్స్ ఇచ్చింది. మధుసూధన్ రెడ్డి మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తనయుడు. ఇక ప్రస్తుతం చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి తనయుడు కరణం వెంకటేష్ కు చీరాల బాధ్యతలు అద్దంకికి కృష్ణ చైతన్య కొండేపికి వరికూటి అశోక్ బాబును నియమించారు. ఇవాళ మిగతా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను పార్టీ ప్రకటించనుంది.