Andhra Pradesh: హోంమంత్రిని కలిసేందుకు సిద్ధమైన టీడీపీ, వైసీపీ

Andhra Pradesh: దీక్ష ముగియగానే ఢిల్లీకి పయనం కానున్న చంద్రబాబు

Update: 2021-10-22 01:45 GMT

ఢిల్లీకి వెళ్లనున్న టీడీపీ, వైసీపీ నేతలు (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీ రాజకీయ యుద్ధం హస్తినకు చేరనుంది. పోటాపోటీ దీక్షలు, నిరసనలతో హోరెత్తిస్తున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇక ఢిల్లీకి వెళ్లి తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రాజ్‌భవన్‌కు వెళ్లిన టీడీపీ నేతలు రాష్ట్రంలో టీడీపీ ఆఫీస్‌లపై జరిగిన దాడులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్ దెబ్బతిందన్న నేతలు.. రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. దాడుల ఘటనను సీబీఐ ద్వారా ఎంక్వైరీ చేయించాలన్నారు.

ఇక ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రులకు లేఖ రాసిన చంద్రబాబు దీక్ష అనంతరం నేరుగా ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులను హోంమంత్రి అమిత్‌షాకు వివరించాలని భావిస్తున్నారు.

టీడీపీ ఢిల్లీ టూర్‌కు కౌంటర్‌గా వైసీపీ నేతలు కూడా హస్తిన పయనమయ్యేందుకు డిసైడ్ అయ్యారు. హోంమంత్రి అమిత్‌షాను కలిసి పరిస్థితులను వివరించనున్నారు. హోంమంత్రితో పాటు ఎస్‌ఈసీని కలిసేందుకు సిద్ధమైన నేతలు సీఎం జగన్ ను అసభ్య పదజాలంతో దూషించడంపై ఫిర్యాదు చేయనున్నారు. అసత్యాలు ప్రచారం చేయడం, పరుష పదజాలంతో దూషించడంపై చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. అలాగే.. టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు వైసీపీ నేతలు. అయితే రెండు పార్టీలు పోటాపోటీగా హస్తిన గడప తొక్కుతుండగా.. కేంద్రం పెద్దల ఆశీర్వాదం ఎవరికి దక్కుతుందనే ఆసక్తి నెలకొంది. 


Full View


Tags:    

Similar News