Kurnool: రాళ్లకు రూపం గీస్తున్న మహిళా శిల్పులు

Kurnool: శిల్పకళా వేదికగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ * ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆళ్లగడ్డ శిల్పాలు

Update: 2021-03-08 02:24 GMT

మహిళా శిల్పి (ఫైల్ ఫోటో)

Kurnool: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ.. ఈ పేరు వినగానే బాంబులు గుర్తుకు వస్తాయి. కానీ అదే ఆళ్లగడ్డ.. శిల్పకళకు ప్రాణం పోస్తోంది. ప్రపంచ దేశాలకు విగ్రహాలను సరఫరా చేస్తోంది. ఇంతటి విజయం వెనుక మహిళా శిల్పుల శ్రమ దాగి ఉందంటే నమ్ముతారా. అవును నిజమే.. మహిళలు ఉలి పట్టి శిల్పాలకు రూపం పోస్తున్నారు. ఆళ్లగడ్డ లోని శ్రీ శారదా శిల్పకళామందిరంలో అద్భుత శిల్పాలు రూపం పోసుకుంటున్నాయి. ఇందులో మహిళా శిల్పుల కృషి అమోఘం. మగవాళ్లకు ధీటుగా శిల్పలను మలిచి ఔరా అనిపిస్తున్నారు.

ఇష్టంతో శ్రమిస్తే.. విజయం బానిసా అవుతుంది. కష్టాలు తలదించుకొని వెళ్లిపోతాయి. ఇదే అక్షర సత్యమని రుజువు చేస్తున్నారు ఆళ్లగడ్డ ఆడబిడ్డలు. ఫ్యాక్షన్.. యాక్షన్‌కు వేదికైన ఆళ్లగడ్డలో సుందర శిల్పాలను చెక్కుతున్నారు. ఆ శిల్పాలు ఇప్పుడు ప్రపంచస్థాయిలో గుర్తుంపు సాధించాయి. ఇక్కడి మహిళా శిల్పులు ఒకప్పుడు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. మహిళలు ఉలి పట్టడం ఎంటని విమర్శలు సంధించారు. ఐనా వెనకడుగు వేయలేదు. ఎన్నో రాళ్లకు ఉలితో ఊపిరిపోశారు.

అయితే ఆళ్లగడ్డ శిల్పాలకు ప్రపంచస్థాయి గుర్తింపు రావడానికి కారణం లేకపోలేదు. భువనేశ్వరి అనే శిల్పకారిని తాము సిద్ధం చేసిన శిల్పాలను సోషల్‌ మీడియా వేదికగా మార్కెటింగ్‌ చేసింది. శిల్పాల సోయగాలను చూసిన ఎందరో విదేశీలు ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టారు.

అల్లగడ్డ మహిళా శిల్పులు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. శిల్పకళారంగంలో వారికి ఎన్నో అవార్డులు వరించాయి. మహిళా సాధికారితను చేతలతో నిరూపించిన ఈ మహిళ శిల్పులకు హెచ్ఎంటీవీ (hmtv) సైతం హ్యాట్సాఫ్ చెబుతోంది.

Tags:    

Similar News