Guntur: రన్నింగ్ ట్రైన్‌లో దారుణం.. మహిళపై దుండగుడి అత్యాచారం
Guntur: రైలులో ప్రయాణిస్తున్న ఒంటరి మహిళపై ఓ అగంతకుడు కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
Guntur: రైలులో ప్రయాణిస్తున్న ఒంటరి మహిళపై ఓ అగంతకుడు కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా పెద్దకూరపాడు రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. రాజమహేంద్రవరంలో సంత్రగచి ప్రత్యేక ట్రైన్‌లో మహిళ ఎక్కింది. మహిళను బ్రతిమిలాడి ఓ వ్యక్తి ట్రైన్ ఎక్కాడు.
ట్రైన్‌లో ఒంటరిగా ఉన్న మహిళపై ఆ వ్యక్తి కత్తితో బెదిరించి డబ్బును లాక్కుని.. అనంతరం మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ సికింద్రాబాద్ ఆర్పీఆఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు.. తదుపరి దర్యాప్తు కోసం ఏపీ నడికుడి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు తెలిపారు.