Chandrababu Naidu: భాష లేకపోతే మనిషి మనుగడే లేదు
Chandrababu Naidu: మాతృభాషలో అధ్యయనం చేస్తేనే విజ్ఞానం వస్తుంది
Chandrababu Naidu
Chandrababu Naidu: భాష లేకపోతే మనిషి మనుగడే లేదన్నారు సీఎం చంద్రబాబు. తెలుగు భాషను నిలబెట్టడానికి జీవితం కృషి చేసిన వ్యక్తి గిడుగు రామ్ముర్తి పంతులని కీర్తించారు. ఆయన స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి సీఎం పాల్గొన్నారు. 10కోట్ల మంది మాట్లాడే భాష తెలుగు కావడం మనందరికీ గర్వకారణం అన్నారు చంద్రబాబు. మాతృభాషలో అధ్యయనం చేస్తేనే విజ్ఞానం వస్తుందన్నారు. ఇంగ్లీస్ వస్తేనే ఉద్యోగాలు వస్తాయి, డబ్బులు వస్తాయనే పిచ్చి ఇటీవల కాలంలో పెరిగిందన్నారు చంద్రబాబు.