Wine Shop: మందు బాబులకు గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ వేళ అర్థరాత్రి 12గంటల వరకు వైన్స్ ఓపెన్..!!
Wine Shop: మందు బాబులకు గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ వేళ అర్థరాత్రి 12గంటల వరకు వైన్స్ ఓపెన్..!!
Wine Shop Timings: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాల పనివేళలను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ రోజుల్లో నిర్ణయించిన సమయానికి భిన్నంగా, ఈ రెండు రోజులు మద్యం షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు విక్రయాలు జరిపేందుకు అనుమతి ఇచ్చింది. న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా వినియోగదారుల డిమాండ్ పెరుగుతుందనే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇక బార్లు, ఇన్-హౌస్ సర్వీసులు, అలాగే ప్రత్యేక ఈవెంట్ల కోసం పర్మిట్ లైసెన్సులు పొందిన సంస్థలకు మరింత వెసులుబాటు కల్పించారు. వీటికి రాత్రి ఒంటిగంట (1 AM) వరకు మద్యం సరఫరా చేసుకునే అవకాశం ఇచ్చారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలు సౌకర్యంగా జరుపుకునేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని ఎక్సైజ్ శాఖ అభిప్రాయపడుతోంది.
అదే సమయంలో అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. రాష్ట్రంలోకి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాటు సారా అక్రమంగా ప్రవేశించకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం ఎక్సైజ్ అధికారుల పనివేళలను కూడా పొడిగించారు. చెక్‌పోస్టులు, సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
న్యూఇయర్ వేడుకలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలు కూడా చట్టాలను పాటిస్తూ బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.