జనసేనకు మళ్లీ నిరాశేనా.. జనసేనకు మరోసారి బీజేపీ హ్యాండిస్తుందా?

Update: 2020-11-24 11:21 GMT

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఢిల్లీ పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. తిరుపతి లోక్‌సభ స్థానానికి త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో జనసేన పోటీకి సిద్ధమవుతున్న తరుణంలో బీజేపీ అగ్రనేతలతో చర్చించే యోచనతో హస్తినకు పవన్ కల్యాణ్, పార్టీ కీలక నేత నాదేండ్ల మనోహర్ తో కలిసి డిల్లీ చేరుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్న జనసేనాని..ప్రధాని, మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులను కలిసి యోచనలో ఉన్నారు. అయితే తిరుపతి ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇదే జరిగితే మరోసారి జనసేనకు బీజేపీ హ్యాండ్ ఇచ్చినట్లే అవుతోంది.

ప్రధానంగా తిరుపతి ఉపఎన్నికతో పాటు ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు పవన్ కల్యాణ్. ఇటీవల అమరావతి రైతులను కలిసిన సేనాని వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఇప్పిస్తానని హామీ కూడా ఇచ్చారు. ఇదే విషయాన్ని చర్చించే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా పవణ్ కల్యాణ్ ప్రచారంపై కూడా ఈ భేటీ తర్వాత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

Tags:    

Similar News