సంక్షేమమే లక్ష్యం: పాలకొల్లులో మంత్రి నిమ్మల ఆకస్మిక తనిఖీ
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల పర్యటన మున్సిపాలిటీలో అభివృద్ధి పనులపై మంత్రి నిమ్మల ఆకస్మిక తనిఖీ టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్లను 80% పూర్తిచేశాం- మంత్రి నిమ్మల
సంక్షేమమే లక్ష్యం: పాలకొల్లులో మంత్రి నిమ్మల ఆకస్మిక తనిఖీ
టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్లను 80శాతం పూర్తయిన అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం విధ్వంసానికి గురిచేసిందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను ఆకస్మిక తనిఖీ చేసి, అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి నిమ్మల. టిడ్కో ఇళ్లలో మిగిలిన పనులు పూర్తిచేసి త్వరలో లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో మున్సిపాలిటీల నిధులను దారి మళ్లించి పట్టణాలను నిర్వీర్యం చేశారన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చి.. కోట్లాది రూపాయలు దోచుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా.. సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.