చల్లని కబురు.. రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాక

ఎండలతో అల్లడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.

Update: 2020-05-30 15:26 GMT

ఎండలతో అల్లడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఆగ్నేయ అరేబియా మహాసముద్రంలో మలదీవ్ ప్రాంతాల్లోకి రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండి అసిస్టెంట్ డైరెక్టర్ నాగరత్నం తెలిపారు.

రాబోయే 48 గంటల్లో తూర్పు మధ్య అరేబియా సముద్రం లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడించింది. తదుపరి 48 గంటల్లో ఈ అల్పపడినం తూర్పు మధ్య అరేబియా సముద్రం గుండా కదిలి వాయుగుండం గా ఏర్పడే అవకాశం ఉందిని తెలిపింది.

రాబోయే రెండు ,మూడు రోజుల్లో జూన్ 1 లోపు ఈ నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని, ఛత్తీస్ ఘడ్ నుంచి తెలంగాణ ,రాయలసీమ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు 5.9 మీటర్ల దూరంలో ఒక ద్రోణి కొనసాగుతోందని వాతావరణ విభాగం తెలిపింది.

దీని ప్రభావంతో తెలంగాణ ప్రాంతంలో ఉరుములు ,మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అయినప్పటికీ రాబోయే 24 గంటల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.


Tags:    

Similar News